HomeTelanaganahyderabadఅసలు దొంగవు నువ్వే...!

అసలు దొంగవు నువ్వే…!

  • ఎమ్మెల్యే ను విమర్శించే స్థాయిలో నువ్వు లేవు…
  • ఇంకో ఏడాది అగు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం…
  • నువ్వొకడివి కాదు మేము కూడా సొంత డబ్బులతో మొరం, చిల్ప వేయించం….! 
  • అసలు నువ్వు కౌన్సిలర్ ఏ కాదు…, మాజీ కౌన్సిలర్ వి అనే విషయం మర్చిపోకు.. ప్రతి సారి నా వార్డ్ అంటున్నావు.
  • నీకు ఉన్న వాల్యూ నువ్వే తీసుకున్నావ్, నిన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు వరాల శ్రీనివాస్ రెడ్డి…..
  • అంటూ…. కౌంటర్ ఇచ్చిన మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బంటు వేణు 

జనవాహిని ప్రతినిధి తాండూరు: శుక్రవారం తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…… తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై విమర్శలు చేసే స్థాయి నీకులేదన్నారు. అభివృద్ధి జరగడం లేదు, నిధులు కేటాయించడం లేదు అని అనడం హాస్యాస్పదంమన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో పనులు ప్రారంభం అయ్యాయాని, ఇంకో ఏడాదిలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అంటూ బంటు వేణు ధీమా వ్యక్తం చేశారు. వార్డ్ లో సొంత డబ్బులతో పనులు చేయించాను అని చెప్పుకోవడం విడ్డురంగా ఉందన్నారు. మా వార్డ్ లలో కూడా మేము సొంత డబ్బులతో పనులు చేయించామని, మేము చెప్పుకోలేదన్నారు. అదేవిదంగా…. 13వ వార్డ్ కు కౌన్సిలర్ సురేష్ ఉన్నారని, అసలు నువ్వు మాజీ కౌన్సిలర్ అనే మాట మర్చిపోయారని విమర్శించారు. ప్రతి సారి నా వార్డ్ అనడం కాదని, మీ స్థాయిని ఎక్కడ ఉందొ ఒకసారి చూసుకోవాలని అన్నారు. తాండూరు మున్సిపల్ లో ఎక్కడ పోటీ చేసిన గెలస్తాను అని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 13వ వార్డ్ లోనే శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయే వారని, ప్రస్తుత కౌన్సిలర్ మామా విట్టల్ నాయక్ చేసిన పనుల వాళ్ళ ఆయన పేరు తో గెలిచారన్నారు. అంతే కానీ శ్రీనివాస్ రెడ్డి వళ్ల గెలవలేదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఉండి తెరాస పార్టీ కి పని చేసిన అసలైన దొంగ వరాల శ్రీనివాస్ రెడ్డి అని ఆరోపించారు. పార్టీ లు మరి ఇప్పుడు నీతులు చెప్పడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే ను, కాంగ్రెస్ నాయకులు దొంగలు అనడం… పై బంటు వేణు మండిపడ్డారు. తాండూరు లో వరాల శ్రీనివాస్ రెడ్డి నీ ఎవ్వరు పట్టించుకోవడం లేదని, ఎదో ఎమ్మెల్యే పై కొన్ని విమర్శలు చేస్తే సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడం కోసం పాకులాడుతున్నారన్నారు. అదేవిదంగా ఆర్బిఓఎల్ శ్రీనివాస్ రెడ్డి ఫ్యాక్టరీ లో ఇసుక డుంపులు ఉన్నాయని బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, వరాల శ్రీనివాస్ రెడ్డి లు చెప్పడం కాదు దమ్ముంటే చూపించాలని బంటు వేణు సవాల్ చేశారు. అనవసరంగా లేని పోనీ ఆరోపణలు చేయ్యడం సరి కాదని, ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖాబార్ధార్ అని వరాల శ్రీనివాస్ రెడ్డి కి బంటు వేణు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments