జాతీయ అవార్డు అందుకున్న ఆ హీరోయిన్ పై వర్మ వ్యాఖ్యలు వైరల్!
Jul 20, 2026 7:20PM

ఒకప్పుడు తెలుగు సినిమాని టెక్నికల్ పరంగా, టేకింగ్ పరంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సగర్వంగా నిలబడేలా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంత కాలంగా తన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రీసెంట్ గా వర్మ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
బాలీవుడ్ ప్రముఖ నటి యామి గౌతమ్ ఆర్టికల్ 370 చిత్రానికి గాను ఉత్తమనటిగా నేషనల్ అవార్డు అందుకుంది. దీనిపై వర్మ స్పందిస్తూ ‘సర్కార్ 3 సినిమా షూటింగ్ సమయంలోనే యామి గౌతమ్ ఒక అద్భుతమైన నటి అని నాకు అర్థమైంది. ఆమె కళ్లలోనే ఒక ప్రత్యేకమైన తీవ్రత, నటన పట్ల అంకితభావం కనిపించేవి. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా, విలక్షణమైన క్యారెక్టర్స్ తో తనని తాను నిరూపించుకోగలదని నేను ఆనాడే నమ్మాను. ఈ రోజు ఆమె దేశంలోనే అత్యున్నతమైన నేషనల్ అవార్డును అందుకోవడం నాకు గర్వంగా ఉంది.
Also read: రవితేజతో ముచ్చటగా మూడో సారి జత కడుతున్న భామ!
ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకి రావడం చాలా కష్టం. యామి గౌతమ్ తన సొంత ప్రతిభతో ఈ స్థాయికి చేరుకుంది. ఈ నేషనల్ అవార్డ్ విజయం కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు. పరిశ్రమలో కష్టపడే ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద ప్రేరణ అని నోట్ షేర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2017లో వచ్చిన ‘సర్కార్ 3’ (Sarkar 3) చిత్రంలో యామి గౌతమ్ కీ రోల్ లో మెరిసింది. అల్లు శిరీష్ డెబ్యూ మూవీ ‘గౌరవం’ లో యామి గౌతమ్ నే హీరోయిన్ అనే విషయం తెలిసిందే.
ram gopal varma, yami gautam
