కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ సెన్సార్ రివ్యూ: అన్న హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడుగా..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే క, కే-ర్యాంప్ సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్, టీజర్ చూస్తే ఈ మూవీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని స్పష్టం అవుతోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఒక్క సెన్సార్ కట్ కూడా పడకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో జీరో సెన్సార్ కట్ పడకుండా వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే ఈ మూవీ అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉందని సెన్సార్ బృందం పేర్కొంది. మూవీలోని డైలాగ్స్ కేవలం యూత్ నే కాకుండా అందరినీ ఆలోచించేలా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మూవీలో కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అవి సెన్సార్ బృందాన్ని కంటతడి పెట్టించాయని టాక్. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వచ్చే సీన్స్ ఆడియన్స్ ను షాక్ కు గురి చేస్తాయని తెలుస్తోంది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ కే ఎన్ చెప్పినట్టుగానే కంటెంట్ పరంగా ఇదోక కల్ట్ క్లాసిక్ అని స్పష్టం అవుతోంది. ఈ కంటెంట్ ను ఆడియన్స్ ఇష్టపడితే మాత్రం ఆకాశమే హద్దు వసూళ్లు ఉంటాయని అంటున్నారు. మరోవైపు జూలై 23న జన నాయగన్ విడుదల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జన నాయగన్, చెన్నై లవ్ స్టోరీ సినిమా మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.