HomeEntertainmentకిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్.. ఎమోషనల్ రైడ్..!

కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్.. ఎమోషనల్ రైడ్..!


కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ రిలీజ్.. ఎమోషనల్ రైడ్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమాలకు యూత్ లో క్రేజ్ ఉంది. విభిన్నమైన కథలతో అలరించి వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం యువత ఫేస్ చేస్తున్న సమస్యల్ని తీసుకుని ఆ కాన్సెప్ట్ తో సినిమా చేస్తుంటాడు ఆయన. మరి తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ ట్రైలర్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ రైడ్ లా అనిపిస్తోంది. ట్రైలర్ రిలీజ్ తో మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్ గా శ్రీ గౌరి ప్రియ నటించింది. వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై చాలా బాగా వచ్చింది. ట్రైలర్ లో అది కనిపిస్తోంది.

ట్రైలర్ బట్టి చూస్తే.. హీరో కిరణ్ అబ్బవరం డైరెక్టర్ అవ్వాలని చెన్నై వస్తాడు. అక్కడ అప్పటికే లవ్ ఫెయిల్యూర్ అయి బాధలో రోజంతా తాగుతూ ఉండే హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. హీరో తనదైన శైలిలో హీరోయిన్ మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తాడు. అలా కొంతకాలం తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత స్టోరీ, ట్విస్టులు, టర్న్ లు తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది..? అనేదే స్టోరీ..

KiranAbbavaram The trailer for the movie Chennai Love Story released starring talented Tollywood

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా బాగా వచ్చింది. ఇక ట్రైలర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ జూలై 24 న థియేటర్లలో విడుదల కానుంది. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అనంత్ శ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చూస్తుంటే ఈ మూవీతో కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్టు గ్యారంటీ అని తెలుస్తోంది.



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments