HomeEntertainmentవిద్యార్థులకు ఆరోగ్య భరోసా..!

విద్యార్థులకు ఆరోగ్య భరోసా..!

  • విద్యార్థుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది
  • తాండూరు బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరం
  • బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్

జనవాహిని ప్రతినిధి తాండూరు: విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలరని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు. బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, స్థానిక న్యూ లోటస్ హాస్పిటల్ సౌజన్యంతో తాండూరులోని బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇంటర్ విద్య ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ అని, ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ప్రతి వారం ఒక ప్రభుత్వ హాస్టల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ క్రమంలోనే గత వారం స్కూల్ హాస్టల్‌లో, ఈ వారం కాలేజ్ హాస్టల్‌లో శిబిరాలు పూర్తి చేశామని, రానున్న రోజుల్లోనూ అన్ని హాస్టళ్లలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ శిబిరంలో న్యూ లోటస్ హాస్పిటల్ ప్రతినిధి మాణిక్యం ఆధ్వర్యంలో డాక్టర్లు జుబెర్ అహ్మద్, ఫిరోజ్ అహ్మద్, నౌరీన్ జహాన్, మహీదర్, సీమ, ముజమ్మిల్ బృందం విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, అనిత, మంజులా, నర్సమ్మ, జగదీశ్వరి, విజయలక్ష్మి, బసవరాజ్, పర్మేష్, రాము ముదిరాజ్, రామ్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments