- రాజకీయంగా ఎదిగిన నాడే ఉనికి చాటుకోగలం
- మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్
- తాండూరులో మున్నూరు కాపు ముఖ్య నాయకుల సమావేశం
జనవాహిని ప్రతినిధి తాండూరు: మున్నూరు కాపులు సమాజంలో సంఘటితం అవుతూ, ఇతర కులాలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్‌లో నిర్వహించిన మున్నూరు కాపు ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పురుషోత్తమ రావు పటేల్ మాట్లాడుతూ… మున్నూరు కాపులు రాజకీయంగా బలంగా ఎదిగిన నాడే సమాజంలో మన ఉనికి తెలుస్తుందని స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలన్నారు. అలాగే, అతి త్వరలోనే వికారాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని సంఘం నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి పటేల్ సభా అధ్యక్షత వహించగా.. రాష్ట్ర ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సిములు పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామా రావు పటేల్, రాష్ట్ర కార్యదర్శి బెజ్జు శ్రీధర్ పటేల్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నింగాల శంకర్ పటేల్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బురకని నాగేష్ పటేల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరిగే అనంత ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరు బుచప్ప పటేల్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు తాండ్ర నరేష్ పటేల్ పాల్గొన్నారు.కార్యక్రమంలో నాయకులు కోట్ల నరేందర్ పటేల్, వెంకట రామ రెడ్డి పటేల్, రాములు పటేల్, మున్నూరు కిరణ్ పటేల్‌తో పాటు జిల్లా, పట్టణ పరిధిలోని మున్నూరు కాపు సంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.