HomeNewsఆసుపత్రి తరలింపు ప్రచారం పచ్చి అబద్ధం..!

ఆసుపత్రి తరలింపు ప్రచారం పచ్చి అబద్ధం..!

  • డిఎంఈ విలీనంతోనే మహర్దశ!
  • కొడంగల్‌కు మార్పు లేదు.. ఆసుపత్రి ఇక్కడే ఉంటుంది
  •  ఐసీయూ వసతులు, ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లతో తాండూరుకు కార్పొరేట్ వైద్యం
  • గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో కుంటుపడిన వైద్యం.. కాంగ్రెస్ పాలనలోనే ఉద్యోగుల జీతాలకు మోక్షం

జనవాహిని ప్రతినిధి తాండూరు:  తాండూరు జిల్లా ఆసుపత్రిని కొడంగల్‌కు తరలిస్తున్నారంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ తెలిపారు. జిల్లా ఆసుపత్రి ఎక్కడికీ వెళ్లదని, తాండూరులోనే సగర్వంగా సేవలందిస్తుందన్నారు. ఆసుపత్రిని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడం వల్లే తాండూరు ఆసుపత్రి రూపురేఖలు మారుతాయని, ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందుతుందని స్పష్టం చేశారు.ఆసుపత్రిని డీఎంఈ కిందకు విలీనం చేయడం వల్ల తాండూరు ప్రాంత ప్రజలకు విప్లవాత్మక మార్పులతో కూడిన వైద్య సేవలు అందనున్నాయన్నారు. భారీగా నిధులు తరలిరావడంతో పాటు ఆసుపత్రి మౌలిక సదుపాయాలు మెరుగుపడుతాయని, ప్రధానంగా ఐసీయూ విభాగాల ఏర్పాటుతో పాటు ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ఒకవేళ డీఎంఈలో విలీనం చేయకపోతే.. పాత పద్ధతిలోనే పరిమిత డాక్టర్లతో వైద్యం కొనసాగుతుందని, దీనివల్ల ఆసుపత్రి అభివృద్ధి చెందదనే అభిప్రాయాన్ని సంతోష్ వ్యక్తం చేస్తున్నారు.గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు నియోజకవర్గ ప్రగతి కుంటుపడిందని కావాలి సంతోష్ మండిపడ్డారు. గతంలో జిల్లా ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉంచడం వల్ల ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదని, ఉద్యోగుల జీతాలు కూడా ట్రెజరీ ద్వారా రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పాలన వల్లే తాండూరు అభివృద్ధికి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని వివరించారు. గతంలో ఉన్న వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, దానిని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చిందని గుర్తుచేశారు. దీని ద్వారా ఆసుపత్రి సిబ్బందికి నెలనెలా ట్రెజరీ ద్వారా సక్రమంగా జీతాలు వచ్చేలా శాశ్వత పరిష్కారం చూపి ఉద్యోగులకు కొండంత అండగా నిలిచిందని కొనియాడారు. తాండూరు ఆసుపత్రి అభివృద్ధిపై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments