HomeNewsపడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి

పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి

పడవ మునిగి 9 మంది మత్స్య కారులు మృతి.. ఆరుగురు గల్లంతు.. ప్రధాని దిగ్భ్రాంతి

పశ్చిమ్ బెంగాల్ లో విషాదకరమైన ఘటన జరిగింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన 15 మంది మత్య్యకారుల్లో 9 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ 9 మంది మృతదేహాలను బెంగాల్ లోని సౌత్ 24 పరాగణాస్ జిల్లా పోలీసులు వెలికి తీశారు. మృతులు ఒడిశా, బెంగాల్ వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జూలై 2 న 15 మంది మత్స్య కారులు ఓ పడవలో పర్బా మేదినిపూర్ జిల్లాలోని దిగ సంకార్ పూర్ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయల్దేరారు. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రోజుల క్రితం ఆ పడవ గల్లంతైంది. అప్పటినుంచి ఆ పడవ ఆచూకీ తెలియలేదు. ఇదే విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. ” ఆ పడవతో సంబంధాలు జూలై 5 న పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎనిమిది రోజులపాటు నిరవధికంగా గాలింపు చర్యలు జరిగాయి. అలా చివరకు బక్కాలి కోస్ట్ దగ్గర బాగేర్ చర్ కు 35 కిలోమీటర్ల దూరంలో పడవను గుర్తించాం. అందులోనుంచి 9 మంది మృతదేహాలను వెలికి తీశాం. మిగతా ఆరుగురు గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నాం” అని తెలిపారు.

WestBengal Tragic incident in 9 fishermen died and six went missing after a boat capsized news

ఈ ఘటనపై ప్రధానిమంత్రి కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. వెస్ట్ బెంగాల్ లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన కలచివేస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ప్రధానమంత్రి నేషనల్ ఫండ్ నుంచి అందిస్తామని.. అలాగే గాయపడిన వారికి రూ. 50, 000 సహకారం అందిస్తామని పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments