రూ. 5.70 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్‌యూవీ.. ట్విన్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీతో సేల్స్‌లో మ్యాజిక్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. గత మే నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచి టాటాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, కేవలం 30 రోజుల్లోనే టాటా పంచ్ తన పవర్ ఏంటో చూపిస్తూ కోల్పోయిన నంబర్-1 కిరీటాన్ని మళ్లీ సొంతం చేసుకుంది.
జూన్ 2026 అమ్మకాల గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా మోటార్స్ సంస్థకు చెందిన పంచ్, నెక్సాన్ మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ రేసులో మారుతి ఫ్రాంక్స్ మూడో స్థానానికి పడిపోగా.. హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO కార్లు టాప్-5 లో చోటు దక్కించుకున్నాయి.

టాటా పంచ్ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడానికి దాని ధర, లగ్జరీ ఫీచర్లు, తిరుగులేని భద్రత ప్రధాన కారణాలు. భారత మార్కెట్లో టాటా పంచ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5,69,990 (సుమారు రూ.5.70 లక్షలు)గా ఉంది. ఈ బడ్జెట్ ధరలోనే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో ఈ కారు అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించి అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది.
దీనితో పాటు టాటా ప్రవేశపెట్టిన అడ్వాన్స్‌డ్ ట్విన్ సిలిండర్ సిఎన్‌జి టెక్నాలజీ కూడా కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. సాధారణ సిఎన్‌జి కార్లలో బూట్ స్పేస్ ఉండదు, కానీ పంచ్‌లో రెండు చిన్న సిలిండర్లను కింద అమర్చడం వల్ల పెద్ద లగేజ్ స్పేస్ లభిస్తుంది.

జూన్ 2026 లో కార్ల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. టాటా పంచ్ ఏకంగా 21,006 యూనిట్ల విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది జూన్ 2025 లో ఈ కారు కేవలం 10,446 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ కారు ఏకంగా 101.10 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఒంటరిగా 19.10 శాతం మార్కెట్ వాటాను పంచ్ కలిగి ఉంది. అదేవిధంగా, టాటా నెక్సాన్ కారు 18,335 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది జూన్ లో 11,602 యూనిట్లు అమ్ముడైన నెక్సాన్.. ఈసారి 58 శాతం వృద్ధిని సాధించి సెగ్మెంట్‌లో 16.60 శాతం వాటాను సొంతం చేసుకుంది.

ఈ అమ్మకాల రేసులో మూడో స్థానంలో నిలిచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు జూన్ నెలలో 13,135 యూనిట్ల విక్రయాలను సాధించింది. గత ఏడాది 9,815 యూనిట్లు అమ్ముడైన ఈ కారు 33.80 శాతం గ్రోత్‌ను నమోదు చేసింది. ఇక నాల్గో స్థానంలో హ్యుందాయ్ వెన్యూ 10,776 యూనిట్ల అమ్మకాలతో (57.10 శాతం వృద్ధి) నిలవగా.. ఐదో స్థానంలో మహీంద్రా XUV 3XO కారు 10,063 యూనిట్ల విక్రయాలతో (42 శాతం వృద్ధి) నిలిచింది.
అయితే, ఒకప్పుడు మార్కెట్‌ను ఏలిన మారుతి సుజుకి బ్రెజ్జా అమ్మకాలు ఈసారి దారుణంగా పడిపోయాయి. బ్రెజ్జా కారు జూన్ నెలలో కేవలం 9,939 యూనిట్లు మాత్రమే అమ్ముడై ఆరో స్థానానికి పడిపోయింది. గత ఏడాది జూన్ లో 14,507 యూనిట్లు అమ్ముడైన బ్రెజ్జాతో పోలిస్తే.. ఈసారి ఏకంగా 31.50 శాతం నెగెటివ్ గ్రోత్ నమోదైంది.
ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచిన కియా సోనెట్ కారు జూన్ లో 9,231 యూనిట్ల అమ్మకాలతో 38.60 శాతం వృద్ధిని కనబరిచింది. ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ ఎక్స్టర్ కారు 8,154 యూనిట్ల విక్రయాలతో 38.80 శాతం గ్రోత్ సాధించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్కోడా కైలక్ కారు 4,039 యూనిట్ల అమ్మకాలతో (26.40 శాతం వృద్ధి) తొమ్మిదో స్థానాన్ని, టయోటా టైజర్ కారు 2,483 యూనిట్ల విక్రయాలతో (3.10 శాతం వృద్ధి) పదో స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఇక చివరి స్థానాల్లో నిలిచిన నిస్సాన్ మాగ్నైట్ 1,167 యూనిట్లు (-11.10% డిగ్రోత్), కియా సిరోస్ 790 యూనిట్లు (2.10% వృద్ధి), రెనాల్ట్ కైగర్ 689 యూనిట్లు (-8.70% డిగ్రోత్), మారుతి సుజుకి జిమ్నీ కారు కేవలం 354 యూనిట్ల (-4.60% డిగ్రోత్) అమ్మకాలతో సరిపెట్టుకున్నాయి.







