HomeNewsకాంగ్రెస్‌లో ‘అనుభవాని’కే పదవులు..!

కాంగ్రెస్‌లో ‘అనుభవాని’కే పదవులు..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • కాంగ్రెస్ కేడర్‌లో జోష్
  • : పదవి కావాలంటే ‘అనుభవం’ ఉండాల్సిందే
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇకపై పార్టీలో పదవులు పొందాలంటే కేవలం గుర్తింపు ఉంటే సరిపోదు, పార్టీ పట్ల నిబద్ధత.. కనీసం మూడేళ్ల సుదీర్ఘ అనుభవం ఉండాలని తేల్చి చెప్పారు. మండల, పట్టణ, డివిజన్ కమిటీల అధ్యక్ష పదవులను ఆశించే వారికి పార్టీలో 3 ఏళ్ల సర్వీస్ ఉండటం తప్పనిసరి.’సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా ఏఐసీసీ వ్యూహాలకు అనుగుణంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన వారికే పట్టం కట్టాలని, ఈ నిబంధనను అతిక్రమించవద్దని జిల్లా అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యాయి.పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కంటే, కష్టకాలంలో జెండా మోసిన పాత కార్యకర్తలకు న్యాయం చేయాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. దీనివల్ల సంస్థాగతంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీపీసీసీ భావిస్తోంది. పార్టీ పట్ల పూర్తి అవగాహన ఉన్న వారినే బాధ్యులుగా నియమించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ మైలేజ్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాండూరు పట్టణ, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఎలా నిర్యయిస్తారో అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments