Peddi: ‘పెద్ది’ ఓటిటి డేట్ పై అధికార ప్రకటన.. ఆ అభిమానులకి మాత్రం షాక్!
Jul 6, 2026 7:18PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ ని మరోసారి చాటి చెప్పిన చిత్రం ‘పెద్ది'(Peddi). జూన్ 4 న భారీ ఎత్తున విడుదలైన పెద్ది మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద తన జులుం ప్రదర్శించి వరల్డ్ వైడ్ గా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి పైగా సాధించింది. థియేటర్లలో చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఫిదా అయిన ఓటిటి సినీ ప్రియులు, పెద్ది డిజిటల్ స్క్రీన్‌లపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ పెద్ది ఓటీటీ హక్కులని కైవసం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ వివరాలని అధికారికంగా వెల్లడించింది. జూలై 9, నుండి స్ట్రీమింగ్ కానున్నట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “ఆట మారొచ్చు కానీ, మొనగాడు మాత్రం మారడు.. చూసేయండి పెద్ది, జూలై 9 నుండి” అంటూ పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో పోస్టర్ రిలీజ్ చేసింది. సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఉత్తరాది సినీ ప్రియుల కోసం హిందీ వెర్షన్‌ని మాత్రం కాస్త ఆలస్యంగా జూలై నెలాఖరున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నిర్ణయం నార్త్ అభిమానులకి షాక్ అని చెప్పవచ్చు.
Also read: Nagabandham: నాగబంధం కలెక్షన్ల సునామీ.. మూడు రోజులకి ఎంతంటే!
మరి థియేటర్లలో సంచలన రికార్డులు సృష్టించిన పెద్ది ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
peddi, ramcharan, buchibabu, janhvikapoor








