Saturday, January 31, 2026
Home NEWS తాండూరు అభివృద్ధికి ‘మనోహర’ బాట…! 

తాండూరు అభివృద్ధికి ‘మనోహర’ బాట…! 

0
0
  • రూ.18.70 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
  •  2028 నాటికి మోడల్ తాండూరుగా తీర్చిదిద్దుతాం
  •  మాటలు చెప్పడం కాదు.. పనులు చేసి చూపిస్తా: బి. మనోహర్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో యూడిఐఎఫ్ స్కీం కింద మంజూరైన రూ. 18.70 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.పట్టణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇందులో భాగంగా…అంబేద్కర్ పార్క్ వద్ద పాత, కొత్త పంప్ హౌస్ పనులతో పాటు బాలాజీ పార్క్ స్థల రక్షణకు రూ. 1.10 కోట్లు. గొల్ల చెరువు కాలుష్య నివారణకు రాఘవేంద్ర స్వామి ఆలయం నుంచి ఈద్గా వరకు నిర్మించే సీసీ డ్రైన్‌కు రూ. 90 లక్షలు. పట్టణంలోని 1 నుంచి 36 వార్డుల పరిధిలో డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణానికి రూ. 5 కోట్లు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అత్యధికంగా రూ. 11.70 కోట్లు కేటాయించి పనులను ప్రారంభించారు.అనంతరం…గత పాలకుల తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. గతంలో నాయకులు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యారని, తాను మాత్రం క్షేత్రస్థాయిలో మార్పు తెస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఓబి పనులు రూ. 90 కోట్లతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, రూ. 45 కోట్లతో చిలుక వాగు ప్రక్షాళన చేపడుతున్నామని తెలిపారు. రాబోయే 5-6 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపుతాం అని హామీ ఇచ్చారు. అభివృద్ధితో పాటు సంక్షేమంలోనూ తాండూరును ముందుంచుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణానికి 500 ఇళ్లు మంజూరు చేశామని, 12 వేల కుటుంబాలకు ‘గృహ జ్యోతి’ ద్వారా ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. యువత ఉపాధి కోసం ఏటీసీ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. 2028 నాటికి తాండూరు మున్సిపాలిటీ ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతుందని, ఆ నాటికి పట్టణ రూపురేఖలు మారుస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here