అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ: ట్విస్టుల మీద ట్విస్టులు బాబోయ్..!
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మూవీ ‘లెనిన్’.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ చేస్తున్న మూవీ కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఇటీవల తిరుపతిలో గ్రాండ్ గా లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. లెనిన్ మూవీ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాంతో మూవీ టీమ్ తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై సర్వత్రా పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ భారీ స్థాయిలో చేస్తోంది మూవీ టీమ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లెనిన్ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే లెనిన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీ ప్రివ్యూ షో ను తాజాగా రామానాయుడు స్టూడియోస్ లో మూవీ టీమ్ వీక్షించింది. ఈ షో కు కొంతమంది మీడియా ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.
ట్రైలర్ లో చూపించినట్లుగానే ఈ మూవీ చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలో స్టార్ట్ అవుతుంది. గ్రామీణ నేపథ్యం, అఖిల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ ఆకట్టుకుంటున్నాయి. చిత్తూరు స్లాంగ్ లో అఖిల్ ఇరగదీసినట్లు అంటున్నారు. ఫస్టాఫ్ లో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య వచ్చే లవ్, ఎమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై బాగుంది. ఇక ఇంటర్వెల్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్.

ఇక సెకండాఫ్ వేరే లెవెల్ లో ఉంటుందని.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు మతి పోగొడతాయని టాక్ వినిపిస్తోంది. ఈ ట్విస్టులు ఎవరి ఊహకూ అందనంతగా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. అఖిల్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. అఖిల్ నుండి ఈ రేంజ్ యాక్టింగ్ ను ఊహించి ఉండరని అంటున్నారు. మొత్తానికి అయ్యగారి ఖాతాలో బ్లాక్ బస్టర్ పడినట్లుగానే చెప్పొచ్చు. ఇక ఫుల్ రివ్యూ కోసం జూలై 10 వరకు ఆగాల్సిందే.







