Home Entertainment సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్.. ప్రేమకథలో ఊహించని షాక్.!

సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్.. ప్రేమకథలో ఊహించని షాక్.!

9
0


సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్.. ప్రేమకథలో ఊహించని షాక్.!

Jul 7, 2026 9:29AM

Google search engine

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’, ‘గోదారి గట్టుపైన’ సినిమాలతో యూత్‌కు దగ్గరైన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఒక విభిన్నమైన సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారని స్పష్టమవుతోంది.

గ్లింప్స్ ఆరంభంలో పవన్ పప్పుల అందించిన విజువల్స్ ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా సాగాయి. ముఖ్యంగా బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, వారి కెమిస్ట్రీ యువతను కట్టిపడేసేలా ఉంది. వాసుకి వైభవ్ అందించిన సంగీతం ఈ దృశ్యాలకు ప్రాణం పోసింది. ‘అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే-రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం’ అంటూ సాగిన లైన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఒక అందమైన పెయింటింగ్ లాంటి ప్రేమకథగా గ్లింప్స్ సాగుతున్న తరుణంలో, దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి చివర్లో ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

సరిగ్గా 1 నిమిషం 17 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ ముగింపులో, హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా చెంపదెబ్బలు కొట్టుకుంటూ ‘ఐ హేట్ యూ’ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతవరకు ఎంతో రొమాంటిక్‌గా సాగిన వాతావరణం, ఒక్కసారిగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ గా మారిపోయింది. ఈ సీన్ చూస్తుంటే సినిమాలో సందీప్ రెడ్డి వంగా మార్క్ కాస్త గట్టిగానే ఉండబోతోందని సినిమా లవర్స్ భావిస్తున్నారు. 

దర్శకుడిగా పరిచయమవుతున్న వేణుగోపాల్ రెడ్డి కథను ఎంతో వైవిధ్యంగా రాసుకున్నట్లు తెలుస్తోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ప్రేమకథల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి వస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 

 

Sandeep Reddy Vanga, Romanchakam, Sumanth Prabhas, Ananthika Sanilkumar, TeluguOne

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here