Home Entertainment Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే 

Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే 

2
0


Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే 

Jul 7, 2026 4:47PM

Google search engine

 ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉన్నపుడే అసలైన టాలెంట్ బయటపడుతుందనే నానుడి ఉంది. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇద్దరు వ్యాఖ్యల మధ్యన పోటీ ఉంటే ప్రేక్షకులంతా అదృష్టవంతులు మరొకరు ఉండరు. అందులోనూ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఉంటే మాత్రం సంగీత ప్రియులు ఎంతో పెట్టి పుట్టిన వాళ్లే అని చెప్పవచ్చు. 

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త మ్యూజిక్ వార్ నడుస్తోంది. సినిమాలకు కథ, కథనంతో పాటు సంగీతం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు, హీరోలు అంతా కూడా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ల వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కంపోజర్లుగా మారిపోయారు అనిరుధ్ రవిచందర్, నయా సెన్సేషన్ సాయి అభయంకర్. కేవలం వీరి పాటల హవా మాత్రమే కాదు, వీరిద్దరూ అందుకుంటున్న పారితోషికాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని  తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

సౌత్ ఇండియా మొత్తం మీద ప్రస్తుతం అత్యధిక ప్యాకేజ్ తీసుకుంటున్న నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు అనిరుధ్ రవిచందర్. ఒకప్పుడు సాధారణ పారితోషికంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. గత ఏడాది వరకు అనిరుధ్ ఒక సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆయన క్రేజ్, సక్సెస్ రేట్ చూసి స్టార్ ప్రొడ్యూసర్లు లైన్ కడుతుండడంతో తన రేట్‌ను ఏకంగా డబుల్ చేసేశాడు.ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్టుకి ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. కేవలం ఒకే ఏడాదిలోనే రెమ్యునరేషన్ రెట్టింపు అవ్వడం గమనార్హం. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో దాదాపు 10 భారీ సినిమాలు ఉన్నాయి. 

అనిరుధ్ రేంజ్ ఇలా ఉంటే, అస్సలు తగ్గనంటూ దూసుకొస్తున్నాడు జెన్ జీ నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్. కేవలం ప్రైవేట్ ఆల్బమ్స్ ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సాయి అభ్యంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. తన తొలి సినిమా  ‘బాల్తీ’ చిత్రానికి ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా వరుసగా ‘డ్యూడ్’, ‘కరుప్పు’ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లని  తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్నటి వరకు ఒక సినిమాకు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిన సాయి అభయంకర్, ఈ తాజా హిట్స్ తర్వాత తన మార్కెట్ రేటును అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం ఆయన కొత్త సినిమాలకు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Also read: దేవుళ్ళకి యమా గిరాకి.. ఇది యాపారం 

ప్రస్తుతం సాయి అభయంకర్ చేతిలో ఐదు క్రేజీ సినిమాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్న ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ ఐదు చిత్రాలలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, సాయి అభయంకర్ నేరుగా అనిరుధ్ రవిచందర్ రెమ్యూనరేషన్‌ను కూడా బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు 25 కోట్లతో అనిరుధ్, మరోవైపు 8 కోట్లతో సాయి అభయంకర్ పోటాపోటీగా ఆఫర్లు కొల్లగొడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీపై తమ మ్యూజికల్ హవాని  స్పష్టంగా చూపిస్తున్నారు.

 

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here