- 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ. సరిత పోటీ
- పార్టీ అవకాశం ఇస్తే గెలిచి తీరుతా
- వార్డు ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం, ఏ. సరిత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సందడి మొదలైంది. మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఏ. సరిత బరిలో ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా వెలుబడిన రిజర్వేషన్ లలో 26వ వార్డ్ బీసీ మహిళా రావడం తో అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో పోటీ చేసే అవకాశం కల్పిస్తే, భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వార్డులోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గమనిస్తున్నానని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వార్డు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాల కొరతను తీర్చి, 26వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ఆశయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, వార్డు అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు.






