Home Entertainment Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు

Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు

5
0


Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు

Jul 4, 2026 4:58PM

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన స్టార్ హీరోల మార్కెట్, ఇప్పుడు గ్లోబల్ స్థాయికి విస్తరించింది. అయితే భారీ క్రేజ్‌తో పాటే బాక్సాఫీస్ వద్ద రిస్క్ కూడా అంతకంతకు పెరుగుతోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములా సినిమాలని పక్కనబెట్టి, మన ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, సోషియో ఫ్యాంటసీ వంటి అత్యంత రిస్కీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా మారుతున్నాయి, ఏయే హీరోలు ఎంతెంత బడ్జెట్‌తో రిస్క్ చేస్తున్నారనే విశ్లేషణ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ రిస్కీ గేమ్ లో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. కల్కి లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలని  మోస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సీతారామం’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో మెప్పించిన హను రాఘవపూడి, ఇంతటి భారీ పాన్ ఇండియా యాక్షన్ వార్ డ్రామాను హ్యాండిల్ చేయడం ఇదే మొదటిసారి. 1930 – 1940 కాలం నాటి బ్రిటిష్ ఇండియా, ప్రీ, ఇండిపెండెన్స్ యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ పీరియడ్ ఎలిమెంట్స్ నేటి మాస్ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, భారీ బడ్జెట్ రికవరీ ఎలా సాధ్యమవుతుంది అనేది ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద ప్రశ్న. హిట్ మాత్రమే సరిపోదు, ఏకంగా 1000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్‌లోకి వస్తుంది.

మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత పెద్ద సోషియో ఫ్యాంటసీ రిస్క్‌కి  సిద్ధమయ్యారు. అప్ కమింగ్ మూవీ ‘విశ్వంభర’ పై భారీ అంచనాలే  ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్  కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సహజంగానే సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగి, బడ్జెట్ దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్‌కు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి గత లేటెస్ట్ సినిమాల మార్కెట్ మరియు బాక్సాఫీస్ రికార్డులను గమనిస్తే, ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం సాధారణ విషయం కాదు. కేవలం తెలుగు మార్కెట్ పైనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తేనే బయ్యర్లు లాభాల బాట పడతారు.

Also read: fauzi: ఫౌజీ సెట్స్‌లో మరోసారి ఘోర ప్రమాదం.. వరుస ప్రమాదాలకి ఇదే కారణమా! 

టాలీవుడ్‌లో కేవలం ఈ ఇద్దరే కాదు, రాబోయే సెకండాఫ్‌లో విజయ్ దేవరకొండ తన రణబలి మూవీతో, నిఖిల్ స్వయంభు మూవీతో తమ మార్కెట్ ని మించిన బడ్జెట్ తో వస్తున్నారు. ఇలా మొత్తం 6 పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటి మొత్తం బడ్జెట్ దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఉండడం గమనార్హం. పీరియాడిక్ సినిమాలకు భారీ విజువల్స్, ఎక్కువ రన్‌టైమ్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు అవసరమవుతాయి. దీంతో ఒక్కో ప్రాజెక్ట్ పై నిర్మాతలకు, బయ్యర్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా వందల కోట్ల నష్టాలు తప్పవు. అయితే, కంటెంట్ బలంగా ఉండి, ప్రేక్షకులకి  కొత్త అనుభూతిని ఇస్తే టాలీవుడ్ మార్కెట్ స్థాయికి 2000 కోట్లు పెద్ద విషయం కాదని గత రికార్డులు నిరూపించాయి. మరి మన స్టార్ హీరోలు, స్టార్ హీరో స్టేటస్ రేసులో ఉన్న వాళ్ళు తీసుకున్న ఈ భారీ రిస్క్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, టాలీవుడ్‌ని  ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. 

 



Source link

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here