స్టార్ హీరో పెళ్లి డేట్ అనౌన్స్.. 61 ఏళ్ల వయసులో మూడో మ్యారేజ్ !!
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. సినిమాల విషయంలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు తెచ్చుకున్న ఈ నటుడు.. ఇప్పుడు తన వ్యక్తిగత విషయంతో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఈ స్టార్ 61 ఏళ్ల వయసులో మూడో వివాహానికి సిద్ధమవుతున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను జూలై 5న ముంబైలోని తన నివాసంలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా అమీర్ 1986లో రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2002లో ఈ జంట విడాకులు తీసుకోగా.. వీరికి జునైద్ ఖాన్ అనే కొడుకు, ఐరా ఖాన్ అనే కూతురు ఉన్నారు. జునైద్ కూడా తండ్రి బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలానే 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. తమ 16 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు 2021లో ప్రకటించారు. వీరు సరోగసీ ద్వారా ఆజాద్ రావు అనే అబ్బాయికి జన్మనిచ్చారు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా గౌరీ స్ప్రాట్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు.

అయితే అమీర్ ఖాన్ తన పెళ్లి వివరాలు వెల్లడిస్తున్నప్పుడు, ఆయన కుమారుడు జునైద్ ఖాన్ నవ్వుతూ పక్కనే నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు అమీర్ ఇప్పటికీ తన మాజీ భార్యలిద్దరితోనూ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే కిరణ్ రావుతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల అమీర్ ఖాన్, రీనా దత్తా, కిరణ్ రావు, గౌరీ స్ప్రాట్ ఒకే కారులో ప్రయాణించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
కొడుకు సమక్షంలోనే వెడ్డింగ్ డేట్ అనౌన్స్..
రాజ్ కుమార్ హిరాణి రూపొందించిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకి అమీర్ ఖాన్, జునైద్ ఖాన్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అమీర్ ను పెళ్లి గురించి అడగ్గా.. తన మూడో పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు. ముంబైలోని తమ ఇంట్లోనే చిన్న వేడుకగా ఈ వివాహం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వెడ్డింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఈ వేడుకకు అందరి ఆశీస్సులు కావాలని.. తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని దీవించండని కోరారు.
“I am getting married on July 5, and the wedding will take place at home with close family and friends.#AmirKhanpic.twitter.com/ohiaWSEFLp
— Milagro Movies (@MilagroMovies) July 3, 2026








