HomeEntertainmentSing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Sing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే!


Sing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Jul 4, 2026 4:05PM

ఎన్నో అద్భుతమైన సృజనాత్మకతతో కూడిన సినిమాలని తెరకెక్కించి తెలుగు సినిమా మురిసిపోయేలా చేసిన  లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆ కోవలోనే  గత నెల జూన్ 12 న వచ్చిన  తాజా చిత్రం ‘సింగ్ గీతం’. మూవీ బాగుందనే పేరు వచ్చినప్పటకి కొత్త వాళ్ళు కాకుండా నోటెడ్ కాస్టింగ్ అయితే విజయం యొక్క రూపం ఇంకోలా ఉండేదనే అభిప్రాయం మూవీ చూసిన వాళ్ళ దగ్గర్నుంచి వ్యక్తమయ్యింది.   

ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్క్రీన్‌పై అలరించడానికి సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా  జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ వెర్షన్ పై నాగ్అశ్విన్ గతంలో మాట్లాడుతు ‘డిజిటల్ స్ట్రీమింగ్‌కి ముందు బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్‌గా  . క్లైమాక్స్‌లో గ్రాఫిక్ వర్క్స్‌ని మరింత మెరుగు పరిచేందుకు టీం ప్లాన్ చేస్తుంది. ఫ్యూచర్‌లో ‘సింగ్ గీతం’ని డిజిటల్ వేదికగా ఎప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు.

సింగ్ గీతం కథాంశం ఎంతో ఆసక్తికరంగా, పర్యావరణ స్పృహని  పెంపొందించే విధంగా ఉంటుంది. కుబేరపురం అనే ఒక గనుల గ్రామంలో కార్పొరేట్ అత్యాశ కారణంగా పర్యావరణం పూర్తిగా నాశనమవుతుంది. అక్కడ మిగిలిన ఒకే ఒక్క పవిత్రమైన చెట్టుపై గౌరీ (అహల్య బమ్రూ) అనే యువతి నివసిస్తూ ఉంటుంది. తన తండ్రి వారసత్వంగా వదిలిన బంగారు గనుల కోసం వెతుకుతూ ప్రతాప్ (అయాన్) అనే యువకుడు ఆ గ్రామానికి వస్తాడు. అక్కడ గౌరీని చూసి ప్రేమలో పడతాడు. అయితే, అత్యాశతో కూడిన ఒక వ్యాపార సామ్రాజ్యం ఆ చివరి పవిత్ర వృక్షాన్ని  కూల్చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ గ్రామానికి ఒక వింత శాపం తగులుతుంది. ఆ శాపం వల్ల గ్రామ ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోతారు. వారు తమ మనసులోని ప్రతి భావాన్ని, కోపాన్ని, ఆనందాన్ని కేవలం పాటల ద్వారా మాత్రమే వ్యక్తపరచాల్సి వస్తుంది.

 

Also read: sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది

డైలాగుల స్థానంలో కేవలం పాటలతోనే సినిమాని  నడిపించడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ప్రయోగం. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు వర్చువల్ మానిటర్ ద్వారా తన ఇంటి నుంచే రిమోట్ పద్ధతిలో దాదాపు 77 నుండి 78 పనిదినాల్లో షూటింగ్‌ని  పూర్తి చేయడం విశేషం. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు మూవీకి  ప్రాణంగా నిలిచాయి. కేవలం 2 గంటల 17 నిమిషాల నిడివి గల ఈ క్లీన్ యూ (U) సర్టిఫైడ్ చిత్రం, ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. యువ నటీనటులు అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి అద్భుత నటనను కనబర్చగా, నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్, విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథి క్యారెక్టర్స్ లో మెరిశారు. 

 

 



Source link

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments