HomeNewsరాజకీయాల్లోకి వస్తేనే సామాజిక మార్పు..!

రాజకీయాల్లోకి వస్తేనే సామాజిక మార్పు..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • యువత రాజకీయాల్లోకి రావడమే స్వామి వివేకానందకు నిజమైన నివాళి
  • తాండూరు బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ పిలుపు
  • ఘనంగా వివేకానంద వర్ధంతి వేడుకలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని తాండూర్ బీసీ సంఘం కన్వీనర్, బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు.బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావంతో పాటు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను బోధించారని కొనియాడారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యం, బాధ్యతాయుతమైన నాయకత్వంతో ముందుకు సాగినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లో భాగస్వామ్యమవ్వడమే స్వామి వివేకానందకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ప్రతినిధులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, అనిత, మంజుల, నర్సమ్మ, మొబాపూర్ మంజుల, పర్మేశ్, దుబాయ్ వెంకట్, బాబా గౌడ్, వెంకటస్వామి, వెంకటేష్, వివేక్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments