HomeAndra Pradeshపాపన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం..!

పాపన్న పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
  • బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు 

జనవాహిని ప్రతినిధి తాండూరు; అణచివేత, అన్యాయాలపై తిరుగుబాటు చేసిన ధీరుడు, బహుజనుల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. బహుజనుల హక్కుల పరిరక్షణకు, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బీసీ మహిళా సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షురాళ్లు అనిత, మంజుల, నర్సమ్మ, యువ నాయకులు పాండు గౌడ్, మంతటి రాజు, సిద్దార్థ్ గౌడ్, దుబాయ్ వెంకట్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బస్వరాజ్, పర్మేశ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మల్కయ్య, శివకుమార్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments