HomeTelanaganahyderabadశత్రువులను ఒకటి చేసిన 'పైలెట్' రీఎంట్రీ

శత్రువులను ఒకటి చేసిన ‘పైలెట్’ రీఎంట్రీ

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • ఎన్ని చర్చలు జరిపిన ఫలితం లేదు
  • రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
  • బిఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్

జనవాహిని ప్రతినిధి తాండూరు;మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎంట్రీతో ప్రత్యర్థి వర్గాల్లో భయం మొదలైందని, ఆయనకున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకనే పాత శత్రువులు కూడా రాత్రికి రాత్రే ఒక్కటవుతున్నారు అని తాండూరు బిఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ ఓ ప్రకటనలో మాట్లాడుతూ
పైలెట్ రోహిత్ రెడ్డి అంటేనే ఒక ప్రభంజనమన్నారు. ఆయన రీఎంట్రీతో కాంగ్రెస్ నేతలకు చెమటలు పడుతున్నాయని , ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, బుయ్యని శ్రీనివాస్ రెడ్డిల మధ్య ఏకంగా రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. నిన్నటిదాకా శత్రువులుగా ఉన్నవారు ఈరోజు భయంతోనే ఆకస్మికంగా కలిశారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, చర్చలు జరిపిన, ఎన్ని అక్రమాలకు ఒడిగట్టినా తాండూరు ప్రజలు మాత్రం ఎప్పుడూ మా నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి వెంటే ఉంటారని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో తాండూరు కు కాబోయే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాత్రమేనని ఇది అందరూ రాసిపెట్టుకోవాలని ధీమా వ్యక్తం చేశారు.
రోహిత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలం మరింత పెరిగిందని, ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయమని సంతోష్ గౌడ్ స్పష్టం చేశారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments