HomeNewsకొత్త అధ్యక్షుల నియామకం...!

కొత్త అధ్యక్షుల నియామకం…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఖరారు
  • వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రతిపాదనలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్
  • తాండూరు కాంగ్రెస్ నూతన అధ్యక్షుల ప్రకటన

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత నియామకాల ప్రక్రియ పూర్తయింది. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండల/టౌన్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధారా సింగ్ జాదవ్ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం, అధిష్టానం ఈ మేరకు ఆమోదం తెలిపింది.  తాండూరు రూరల్: రాజ్ కుమార్ మైల్వార్, బషీరాబాద్: పాట్లోళ్ల రాజవర్ధన్ రెడ్డి, పెద్దేముల్: పిన్నముల్ మహిపాల్ రెడ్డి, యాలాల: కుర్వ మహిపాల్  , తాండూరు     టౌన్: రొయ్యల నాగరాజ్ అధ్యక్షులుగా నియమితులైయ్యారు. నూతన అధ్యక్షులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి, క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ఈ నియామకాల ద్వారా స్పష్టమైంది. ఈ ప్రకటనతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments