HomeNewsవీడియో పై క్లారిటీ ఇచ్చిన నాయకుడు..!

వీడియో పై క్లారిటీ ఇచ్చిన నాయకుడు..!

  • వివాదాస్పద వీడియోపై వివరణనిచ్చిన కాంగ్రెస్ నాయకుడు..
  • పదేళ్ల క్రితం నాటి పరిస్థితులపైనే నా వ్యాఖ్యలు.. కాలనీల ప్రజలు తప్పుగా భావించవద్దు
  • కాంగ్రెస్ పార్టీ నాయకుడు నయీమ్ ఆఫు….! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని కొన్ని కాలనీల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుగా అనుకోవద్దని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నయీమ్ అఫు విజ్ఞప్తి చేశారు. పలు కాలనీ లపై చేసిన వ్యాఖ్యల వివాదం పై ఆయన స్పందించారు. డ్రగ్స్ వాడకంపై తాను మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోందని, అది కొన్ని కాలనీల ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ప్రజలతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఆయా కాలనీల అభివృద్ధిలో నేను భాగస్వామినయ్యానన్నారు. ఆ వీడియోలో నేను ప్రస్తావించిన అంశాలు పదేళ్ల క్రితం నాటి పరిస్థితులకు సంబంధించినవి మాత్రమేనని,ప్రస్తుత కాలనీ వాసులను ఉద్దేశించి చేసినవి కావు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో పట్టణం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన కొనియాడారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల సహకారంతో కాలనీల్లో విద్య, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కృషి జరుగుతోందన్నారు. యువత భవిష్యత్తు కోసం, క్రీడల ప్రోత్సాహానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, తను చేసిన వ్యాఖ్యలను తప్పుగా భావించవద్దని కాలనీ యువకులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments