యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా…?

0
198
  • రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ‘డ్రగ్స్ పార్టీ’పై జోగుల ఎబినైజర్ ఆగ్రహం
  • యూత్ లీడర్ అని చెప్పుకుంటూ యువతను పెడదోవ పట్టిస్తారా?” –
  •  కాంగ్రెస్ యువ నాయకుడు జోగుల ఎబినైజర్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో నిన్న రాత్రి జరిగినట్లుగా చెప్తున్న ‘డ్రగ్స్ పార్టీ’ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జోగుల ఎబినైజర్ తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం దారుణమని ఆయన మండిపడ్డారు.ఆదివారం ఒక ప్రకటనలో ఎబినైజర్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను ఒక యూత్ లీడర్‌ని అని, యువత గొంతుకని నిరంతరం ప్రగల్భాలు పలికే రోహిత్ రెడ్డి.. తన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు..? అని నిలదీశారు. నైతిక విలువలను వదిలేసి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల సంస్కృతిని ప్రోత్సహించడం సమాజానికి ప్రమాదకరమని ఎబినైజర్ హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడానికి ప్రభుత్వం ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటుంటే, మరోవైపు మాజీ ప్రజాప్రతినిధుల ఫామ్‌హౌస్‌లే వీటికి వేదికలుగా మారడం సిగ్గుచేటని విమర్శించారు.యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి నాయకుల అసలు రంగును ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here