HomeNewsవిద్యార్థుల మధ్య శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థుల మధ్య శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

జనవాహిని ప్రతినిధి తాండూర్: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం స్థానిక వి.వి.హెచ్.ఎస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళా పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్స్‌ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గాజుల మాధవి మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పేద విద్యార్థులకు అండగా ఉండటమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వ వంశీ, బాలు గౌడ్, కవిత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments