HomeNewsబకాయిదారులకు రెడ్ నోటీసులు...! 

బకాయిదారులకు రెడ్ నోటీసులు…! 

  • పన్ను చెల్లించకుంటే ఆస్తుల జప్తు
  •  తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేస్తున్న యజమానులపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మొండి బకాయిదారులకు నేరుగా ‘రెడ్ నోటీసులు’ జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. నోటీసులు అందుకున్న వారు వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని, నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ పన్నుల వసూళ్ల కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్.ఐ రాములు, వార్డ్ ఆఫీసర్లు స్నేహ లతా రెడ్డి, అనిల్ కుమార్, తేజస్విని, బిల్ కలెక్టర్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

📰

ప్రభంజనం • ఈ-పేపర్ డిజిటల్ క్లిప్

ఈ వార్తను వాస్తవిక పత్రికా పేపర్ లేదా సోషల్ మీడియా పోస్టర్‌గా మార్చి షేర్ చేయండి

💬 WhatsApp
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments