Home News బీఎస్ఆర్ ‘సుడిగాలి’ ప్రచారం…!

బీఎస్ఆర్ ‘సుడిగాలి’ ప్రచారం…!

21
0
  • వార్డు 1, 13లలో బీఎస్ఆర్ సుడిగాలి ప్రచారం
  • ​కాంగ్రెస్ గూటికి మల్ రెడ్డిపల్లి యువత.. పార్టీ బలోపేతమే లక్ష్యమన్న బీఎస్ఆర్

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. సోమవారం వార్డు నంబర్ 13 పరిధిలోని గ్రీన్‌సిటీ, వార్డు నంబర్ 1 మల్ రెడ్డిపల్లి ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.మల్ రెడ్డిపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై భారీ సంఖ్యలో యువత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన బీఎస్ఆర్, యువత భాగస్వామ్యంతోనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బీఎస్ఆర్ మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాలు తెలిసిన పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. యువత మద్దతుతో పార్టీ గ్రామస్థాయిలో మరింత బలోపేతమవుతోందన్నారు. వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, గ్రీన్‌సిటీ మరియు మల్ రెడ్డిపల్లి ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు యువకులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి (Share This Article....)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here