- తాండూరులో రాజకీయ వేడి
- ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న బిఆర్ఎస్ యూత్ లీడర్ అనిల్ బాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు;మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరు నెలల తర్వాత సోమవారం తాండూరుకు రావడంతో బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు అనిల్ బాండ్, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మరియు ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఈ పరిణామంపై బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు అనిల్ బాండ్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.
ఉత్సాహంలో వచ్చిన మాటలే తప్ప కావాలని అనలేదు
ర్యాలీలో తమ నాయకుడు వచ్చాడనే ఆనందంలో, ఉత్సాహంలో అనుకోకుండా కొన్ని మాటలు దొర్లాయని, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కానీ, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డిని కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని అనలేదని అనిల్ బాండ్ స్పష్టం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పై ఉన్న గౌరవంతోనే తాను చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకుంటున్నానని, అంతే తప్ప కాంగ్రెస్ నాయకులు పెట్టిన కేసులకు భయపడి కాదని తేల్చి చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న తాండూరు ను రాజకీయం చేస్తూ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన మాటలను అనిల్ బాండ్ తిప్పి కొట్టారు. నియోజకవర్గం అంతా నిజంగానే అభివృద్ధి లో ప్రశాంతంగా ఉందని ఆరోపించారు. తాండూరు ను అభివృద్ధి చేయాలనే ధ్యాస కాంగ్రెస్ నేతలకు లేదు కానీ, ప్రతిదానికీ కేసులు పెట్టాలనే సోయి మాత్రం ఉందంటూ చురకలు అంటించారు. గతంలో కూడా తనపై ఎన్నో కేసులు పెట్టారని, భయం లేకుండా ఎలాంటి కేసులనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లే ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా వెనక్కి తీసుకున్నానని… మరి కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగా తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటారా? అని కాంగ్రెస్ నాయకులను అనిల్ బాండ్ ప్రశ్నించారు.ఈ కార్యక్రమం బీ ఆర్ ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు,వినోద్ కుమార్, మహమ్మద్ ఇబ్రహీం, అశోక్ ముదిరాజ్ మహేష్ రెడ్డి, అబేద్, శేఖర్ ముదిరాజ్, సామీ, తదితరులు పాల్గొన్నారు.