HomeTelanaganahyderabadబుయ్యని, పట్నం భేటీ..!

బుయ్యని, పట్నం భేటీ..!

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు రాజకీయంలో తీవ్ర సంచలనం
  • మహేందర్‌రెడ్డి, బుయ్యని రహస్య భేటీ!
  • సీఎం ఆదేశాలతోనే చర్చల…! 

తాండూరు,జనవాహిని ప్రతినిధి; తాండూరు నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. చీఫ్ వీఫ్ పట్నం మహేందర్‌రెడ్డి, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డిల మధ్య జరిగిన అనూహ్య భేటీ ఇప్పుడు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే గదిలో దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ ఏకాంతంగా సుదీర్ఘ సమాలోచనలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా? లేక నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుట్టే వ్యూహమా? అనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా బుయ్యను శ్రీనివాస్ రెడ్డి వ్యూహాలు మారింత ఆసక్తిగా మారాయి.
దాదాపు రెండు గంటల సుదీర్ఘ సమాలోచన, ఇద్దరు నేతలు ఏకాంతంగా భేటీ అయి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
చర్చించిన అంశాలను ఇరు నాయకులు అత్యంత గోప్యంగా ఉంచడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.ఈ అనూహ్య సమావేశంతో స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు, అనుచరుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఇరువురి భేటీ జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఈ భేటీ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments