HomeNewsశ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? ఉపయోగాలేంటి?

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? ఉపయోగాలేంటి?

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY

శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? ఉపయోగాలేంటి?

వరలక్ష్మీ వ్రతం అనేది హైందవ సంప్రదాయంలో, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే ఒక పవిత్రమైన పూజ. శ్రీమహావిష్ణువు సతీమణి, అష్టలక్ష్ములకు రూపమైన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం అంటే ఏంటి?

“వరాలు ఇచ్చే లక్ష్మీదేవిని పూజించే వ్రతమే” వరలక్ష్మీ వ్రతం. ఈ రోజున ఇల్లు శుభ్రం చేసుకుని, ముగ్గులు పెట్టి, కలశ స్థాపన చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. అమ్మవారిని నవధాన్యాలు, పూలు, పసుపు, కుంకుమ, తోరణాలతో పూజించి, రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలిస్తారు.

Varalakshmi Vratam Why It is observed during the month of Shravana What are its benefits

ఎందుకు జరుపుకుంటారు?

ఈ వ్రతం వెనుక ఒక సుప్రసిద్ధ పౌరాణిక కథ ఉంది. మగధ దేశంలో ‘చారుమతి’ అనే పరమ పతివ్రత, ఉత్తమ గృహిణి ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఒకనాడు కలత నిద్రలో ఉన్న చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చి, “శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీ కోరికలన్నీ నెరవేరుస్తాను” అని చెప్పింది. చారుమతి ఈ విషయాన్ని తోటి స్త్రీలకు తెలిపి, అమ్మవారు చెప్పినట్లే శ్రావణ శుక్రవారం నాడు వ్రతం ఆచరించింది. అలా వ్రతం పూర్తి కాగానే ఆమెకు, ఆమె కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభించాయని పురాణాలు చెప్తున్నాయి. నాటి నుంచి మహిళలు ఆచారంగా ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు.

Varalakshmi Vratam Why It is observed during the month of Shravana What are its benefits

వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల ఉపయోగాలేంటి?

శాస్త్ర ప్రకారం, వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల అష్టలక్ష్ములను (ధన, ధాన్య, ధైర్య, శౌర్య, విద్య, కీర్తి, విజయ, సంతాన లక్ష్ములు) ఒకేసారి పూజించినంత ఫలం దక్కుతుంది. పూజ చేసే ముత్తైదువులకు సౌభాగ్యం పెరుగుతుందని, భర్తకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలిగి, ధనధాన్యాలకు కొదవ ఉండదు. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుందని నమ్మకం. ఇంట్లో ప్రతికూల శక్తులు తొలిగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం, శాంతి నెలకొంటాయి. వరలక్ష్మీ వ్రతం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు.. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యకరమైన సంబంధాలు, ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన పండగ.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments