- మా నాయకుల పట్ల అసభ్య పదజాలం వాడితే…
- భద్రేశ్వర దేవాలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్
జనవాహిని ప్రతినిధి తాండూరు: నేడు తాండూరుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ర్యాలీ సంధర్బంగా బిఆర్ఎస్ నాయకుడు అనిల్ బాండ్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిల పట్ల వాడిన అసభ్య పదజాలం పై భావిగి భద్రేశ్వర్ దేవస్థాన మాజీ చైర్మన్ తీవ్రంగా మండిపడ్డారు… తాండూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న తాండూరులో మళ్ళీ అల్లోకల్లోలం సృష్టించాలి అని చూస్తున్నారు ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సందర్బంగా పటేల్ కిరణ్ మాట్లాడుతూ రౌడీయిజంకు తాండూరు ప్రజలు చరమగీతం పాడారు,ప్రశాంతంగా ఉన్న తాండూరులో అలజడి సృష్టించాలి అని చూస్తే సహించేది లేదన్నారు. అనిల్ బాండ్ అన్న మాటల కన్నా ఎక్కువ మాటలు అంటాం…మీ చరిత్ర తాండూరు మొత్తం కు తెలుసన్నారు. వెంటనే బహిరంగ అనిల్ బాండ్ క్షమాపణ చెప్పాలని లేనిపక్షం లో తీవ్ర పరిణామాలు ఎదురుకోవాలిసి వస్తుందని హెచ్చరించారు.