HomeTelanaganahyderabadచివరికి అధ్యక్ష పదవిని కూడా వదలని మహారాజ్ ఫ్యామిలీ..! 

చివరికి అధ్యక్ష పదవిని కూడా వదలని మహారాజ్ ఫ్యామిలీ..! 

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  •  ఎస్టి మహిళకు దక్కాల్సిన పదవి
  • కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి బిఆర్ఎస్ నేత చెక్  
  • సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా వెంకటేష్ మహారాజ్ 
  •  కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి

జనవాహిని ప్రతినిధి తాండూరు: బషీరాబాద్ మండల సర్పంచుల సంఘం ( సర్పంచుల ఫోరం) అధ్యక్ష ఎన్నిక స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ మండలంలోనూ మహిళలకు సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి ప్రాతినిధ్యం లేకపోవడంతో, ఈసారి బషీరాబాద్ మండల అధ్యక్షురాలిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఎన్నుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు భావించారు. అయితే, బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడి అనూహ్య ఎంట్రీతో సమీకరణాలన్నీ తలకిందులయ్యాయి.మండలంలో ఉన్న 100 శాతం బిఆర్ఎస్ పార్టీ సర్పంచులంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన మహారాజ్ కుటుంబ సభ్యుడైన వెంకటేష్ మహారాజ్‌కు మద్దతుగా నిలిచారు. బిఆర్ఎస్ సర్పంచులందరి పూర్తి మద్దతు లభించడంతో వెంకటేష్ మహారాజ్ సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.గతంలో మినిస్టర్ పదవుల నుండి నియోజకవర్గంలో కీలకమైన ప్రతి పదవి మహారాజుల కుటుంబానికే దక్కిందని, ఇప్పుడు చివరికి సర్పంచుల సంఘం అధ్యక్ష పదవిని కూడా వదలకుండా వారే కైవసం చేసుకున్నారని మండలంలో తీవ్ర చర్చ నడుస్తోంది. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఎస్టీ మహిళకు అవకాశం కల్పించాలని తలపెట్టినప్పటికీ, మండలంలో మహారాజుల పెత్తనం కారణంగానే ఇతర నాయకులకు, బలహీన వర్గాలకు పదవులు దక్కకుండా పోతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల సర్పంచులు, ముఖ్య నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, బిఆర్ఎస్ నాయకుల వ్యూహానికి చెక్ పెట్టలేకపోయారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. సొంత పార్టీలోని ఇతర నాయకులను ప్రోత్సహించకుండా, ఒక ఎస్టీ మహిళకు రావలసిన అవకాశాన్ని చేజారేలా చేశారని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments