- 8వ వార్డులో ఇంటింటికీ పింఛన్ దరఖాస్తుల నమోదు
- బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ హుస్సేన్ ప్రత్యేక చొరవ
- కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ లేకుండా ఇంటి ముంగిటకే సేవలు
- హర్షం వ్యక్తం చేస్తున్న వార్డు ప్రజలు
జనవాహిని ప్రతినిధి తాండూరు: ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న ‘చేయూత’ పింఛన్ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పింఛన్ దరఖాస్తుల కోసం స్థానిక ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా వారి ఇంటి ముంగిటకే వెళ్లి నూతన దరఖాస్తులను నమోదు చేయిస్తున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ… వార్డు ప్రజల సంక్షేమమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను త్వరితగతిన తెలుసుకుని పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఎవరూ కూడా పింఛన్ సాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి స్వయంగా ఇళ్లకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తుండటంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సాయి, స్థానిక నాయకులు పింటూ, అంజి, మహేష్ తదితరులు పాల్గొని దరఖాస్తుల నమోదు ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా పూర్తి సహకారం అందించారు.
