Nayanthara:నయన్ కొత్త స్ట్రాటజీ..టాక్సిక్‌తో మార్పు..!!
కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బిజీగా ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు నయనతార. హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆమెకు చేతినిండా సినిమాలు వచ్చాయి వస్తున్నాయి. సాధారణంగా పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. కానీ నయనతార విషయంలో అలా కాదు..వరుస ఆఫర్లు ఈ బ్యూటీని పలకరిస్తూనే ఉన్నాయి. కెరీర్‌లో కొన్నిసార్లు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ కూడా.. ఆమె దర్శకులకు నిర్మాతలకు గ్యారెంటీ హీరోయిన్‌గా మారిపోయారు. అందుకే నయనతారకు అంత క్రేజ్ ఉంది.
రూటు మార్చిన నయనతార
సమంతా, త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి సౌత్ హీరోయిన్లు ఒక సినిమాకు సైన్ చేశారంటే ఆ సినిమా పూర్తయి.. ప్రమోషన్స్ వరకు కూడా వారంతా యాక్టివ్‌గా పనిచేస్తారు. కానీ నయనతార విషయంలో అలా కాదు. సినిమా కంప్లీట్ చేశామా మరో సినిమా పై ఫోకస్ చేశామా అన్నట్లుగానే ఈ బ్యూటీ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే నయనతార నటించిన సినిమాలను ఆమె ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు, చేసుకోలేదు. ప్రమోషన్స్‌లో భాగం కూడా కాలేదు.ఎప్పుడూ వాటికి దూరంగానే ఉండేది. అది ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన పంథా తనదే అన్నట్లుగా వ్యవహరించేది. ఈ క్రమంలోనే డస్కీ బ్యూటీపై పలు విమర్శలు కూడా వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా మార్పలు వస్తున్న నేపథ్యంలో నయనతార కూడా తన రూటును మార్చినట్లు కనిపిస్తోంది.

టాక్సిక్ ప్రమోషన్స్‌లో నయన్
తాజాగా నయనతార నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నయనతారతో పాటు పలువురు బడా తారలు ఈ చిత్రంలో తళుక్కుమంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ ప్రారంభం అయ్యాయి. అయితే రొటీన్‌కు భిన్నంగా నయన్ తన పంథాను మార్చుకుని ఈసారి టాక్సిక్ ప్రమోషన్స్‌కు హాజరైంది. భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక టాక్సిక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందుకు కారణం ఆది నుంచి కూడా ఈ మూవీ చుట్టూ కాంట్రవర్శీలే ఎక్కువగా కనిపిస్తాయి.అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ వంటి స్టార్లు తెరపై కనువిందు చేయనున్నారు. ప్రతీ హీరోయిన్‌కు తమదైన సొంత ఫ్యాన్ బేస్,పాపులారిటీ ఉంది.
భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్‌తో టాక్సిక్
ఇలాంటి భారీ బడ్జెట్, భారీ స్టార్‌కాస్ట్ ఉన్న చిత్రంపై సహజంగానే అందరి దృష్టి పడుతుంది. ఏ ఒక్క నటుడు లేదా నటి పైనో ఫోకస్ ఉండదు. అందుకే కాబోలు ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ నయనతార ఈ మూవీ ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టినట్లయితే మిగతా హీరోయిన్ల డామినేషన్ ఎక్కువగా ఉండేది. అదే సమయంలో నయనతార విమర్శలపాలయ్యేదనే అభిప్రాయం సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నయనతార, కియారా లాంటి పాపులర్ స్టార్లు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగితే ఈ చిత్రానికి మరింత బలం చేకూరుతుంది. అంతేకాదు నయన్ లాంటి హీరోయిన ప్రమోషన్స్‌లో పాల్గొన్నదంటే ప్రేక్షకులకు టాక్సిక్ చిత్రంపై పాజిటివ్ సిగ్నల్స్ వెళతాయి.
మొత్తానికి నయనతార ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ద్వారా అది టాక్సిక్ చిత్ర బృందానికే కాదు… వ్యక్తిగతంగా కూడా ఆమె తన అభిమానులను కలిసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఇప్పుడున్న ఇండస్ట్రీ కాంపిటీషన్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కాలం హీరోయిన్లంతా నాలుగు రాళ్లు వెనుకేసుకునేందుకు ఇదే ఫార్ములాను పాటిస్తున్నట్లు వారు గుర్తు చేస్తున్నారు.


