HomeEntertainmentసినిమా ఆఫర్ పేరుతో దారుణం: 33 ఏళ్ల నటిపై లైంగిక దాడి.. దర్శకుడు అరెస్ట్!

సినిమా ఆఫర్ పేరుతో దారుణం: 33 ఏళ్ల నటిపై లైంగిక దాడి.. దర్శకుడు అరెస్ట్!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


సినిమా ఆఫర్ పేరుతో దారుణం: 33 ఏళ్ల నటిపై లైంగిక దాడి.. దర్శకుడు అరెస్ట్!

బాలీవుడ్ డెైరెక్టర్ షకీల్ నూరానీ(73)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సినిమాలో ఆఫర్ ఇస్తానని.. ఆ విషయంపై చర్చించాలని 33 ఏళ్ల సినీ నటిని ముంబైలోని మాల్వాణిలో గల తన నివాసానికి పిలిపించుకున్న డైరెక్టర్.. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. చర్చల పేరుతో పిలిపించిన డైరెక్టర్.. తనకు తెలియకుండా కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడని వెల్లడించింది. ఆ తర్వాత తనపై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టడమే కాకుండా.. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

గ్లోబల్ స్థాయిలో 'ధురంధర్’ సంచలనం
గ్లోబల్ స్థాయిలో ‘ధురంధర్’ సంచలనం

Bollywood Director Shakeel Noorani Arrested for Alleged Rape of Actor in Mumbai Full Details Here

పోలీసు కస్టడీ విధించిన న్యాయస్థానం
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డైరెక్టర్ షకీల్ నూరానీని అరెస్ట్ చేసి.. బోరివలి హాలిడే కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి ఆగస్టు 12వ తేదీ వరకు పోలీస్ కస్టడీ విధించింది. అరెస్ట్ అయిన షకీల్ నూరానీ బాలీవుడ్ లో పలు సినిమాలకు రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించారు. ముఖ్యంగా 1999లో వచ్చిన ‘బడే దిల్ వాలా’, 2000 నాటి ‘జోరు కా గులామ్’ వంటి హిట్ సినిమాలతో ఆయన గుర్తింపు పొందారు.

Toxic Trailer: ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Toxic Trailer: ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. అసలు విలన్ ఎవరో తెలుసా?



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments