HomeEntertainmentవిజయ్ దేవరకొండ విల‌న్‌, ఇప్పుడు హీరో..తెలుగులో కొత్త సినిమా ప్రారంభం!

విజయ్ దేవరకొండ విల‌న్‌, ఇప్పుడు హీరో..తెలుగులో కొత్త సినిమా ప్రారంభం!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY


విజయ్ దేవరకొండ విల‌న్‌, ఇప్పుడు హీరో..తెలుగులో కొత్త సినిమా ప్రారంభం!

Aug 9, 2026 8:33PM

విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కింగ్‌డమ్’లో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ నటుడు వెంకటేష్ వీపీ (Venkitesh VP) టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రతికూల షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాలో కథానాయకుడిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు.

‘రుద్రాంశ సెల్యూలాయిడ్’ పతాకంపై తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఒక ఆసక్తికర చిత్రంలో వెంకటేష్ వీపీ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటంతో పాటు, చిత్ర యూనిట్ రూపొందించిన ఒక ఆకర్షణీయమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా వెంకటేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “దాదాపు ఏడాది కాలంగా హీరోగా నటించే సరైన అవకాశం కోసం నిరీక్షిస్తున్నాను. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చిత్ర నిర్మాణ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి మలయాళ రియాలిటీ షో ద్వారా సినీ ప్రయాణం మొదలుపెట్టిన వెంకటేష్, టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తొమ్మిదేళ్ల పాటు తీవ్రంగా శ్రమించారు. ‘ది ప్రీస్ట్’, ‘స్టాండ్ అప్’ మరియు తమిళ చిత్రం ‘రెబెల్’ లలో నటించి గుర్తింపు పొందిన ఆయన, ‘కింగ్‌డమ్’ చిత్రంలో మురుగన్ పాత్రతో విలన్‌గా రఫ్ అండ్ టఫ్ నటనతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు.

గతంలో ‘కింగ్‌డమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. “నన్ను ఒక్కసారైనా కథానాయకుడిగా చూడాలనుంది.. అవకాశాలు ఇవ్వండి” అని ఆయన వేడుకున్న తీరు అందరి హృదయాలను తాకింది. అన్నట్లుగానే ఇప్పుడు ఆయన కోరిక నెరవేరి హీరోగా మారడం విశేషం.

స్వయంకృషితో ఎదిగిన ఈ యంగ్ యాక్టర్ హీరోగా ప్రమోషన్ పొందడంపై నెటిజన్లు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడే తత్వమున్న వెంకటేష్‌కి టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. విలన్‌గా మెప్పించిన వెంకటేష్, కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తారో వేచి చూడాల్సిందే!



Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments