- గడప గడపకూ ‘విజయక్క శ్రీమంత కానుక’..
- బాలింతలకు జనని కిట్లు..
- ప్లాస్టిక్ రహిత గ్రామానికి పిలుపు
- కంజర్ల విజయలక్ష్మి…!
జనవాహిని ప్రతినిధి తాండూరు: సేవే మార్గంగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ తాండూర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో దూసుకుపోతోంది. యాలాల్ మండల కేంద్రంలో సోమవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక, సేవా కార్యక్రమాలు స్థానిక ప్రజల మనసులను అమితంగా ఆకట్టుకున్నాయి.ఫౌండేషన్ చైర్‌పర్సన్ కంజర్ల విజయలక్ష్మి యాదవ్ స్వయంగా గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి, గర్భిణీ మహిళలకు విజయక్క శ్రీమంత కానుక అందజేసి ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు అందించారు. ఆడబిడ్డల పట్ల ఆమె చూపిన ప్రేమాభిమానాలు, అక్కగా నిలబడి నిర్వహించిన శ్రీమంతం వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనంతరం బాలింతల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ‘జనని కిట్స్’ను ఉచితంగా అందజేశారు.కేవలం ఆరోగ్య, సంక్షేమ రంగాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ ఫౌండేషన్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు కలిగే ముప్పును వివరిస్తూ, యాలాల్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని విజయలక్ష్మి యాదవ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రత్యేకంగా తయారు చేయించిన పర్యావరణ హిత పునర్వినియోగ బట్ట సంచులను గ్రామ ప్రజలకు విస్తృతంగా పంపిణీ చేశారు. ఇకపై ప్రతీ ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచులనే వాడాలని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, ప్రముఖ నాయకులు ప్రకాష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్, కమ్మరి శేఖర్, అమ్రేష్ ముదిరాజ్, నర్సిములు మాలిగేరి, బాల్ రాజ్, చిట్లపల్లి రవి, సురేష్ మంగలి, అనంతమ్మ పాల్గొన్నారు.
