― Advertisement ―

ఆసుపత్రి మూసివేత కాదు.. అప్‌గ్రేడ్…!

కొడంగల్  కు మెడికల్ కాలేజీ.. వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల కల సాకారం   రూ. 150 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం  సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు ...
HomeNEWSఆసుపత్రి మూసివేత కాదు.. అప్‌గ్రేడ్...!

ఆసుపత్రి మూసివేత కాదు.. అప్‌గ్రేడ్…!

spot_img
  • కొడంగల్  కు మెడికల్ కాలేజీ.. వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల కల సాకారం 
  •  రూ. 150 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం
  •  సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు ధన్యవాదాలు
  •  ఆసుపత్రి అప్‌గ్రేడ్‌పై ప్రతిపక్షాలవి తప్పుడు ప్రచారాలు: కావలి సంతోష్ 

జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా ప్రజల 60 ఏళ్ల నాటి చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ కల నేడు సాకారమైందని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కొడంగల్    నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలకు తాండూర్ ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.స్థానిక జిల్లా ఆసుపత్రి ని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ బోధనాసుపత్రిగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేయడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా కావలి సంతోష్ మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రిని మూసివేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. “ఇది ఆసుపత్రి మూసివేత కాదు, మరింత ఆధునికీకరణ. ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆసుపత్రిని 300 పడకలకు పెంచుతున్నాం. అలాగే కేవలం 15 మందిగా ఉన్న డాక్టర్ల సంఖ్యను ఏకంగా 200 మందికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపక్ష బిఆర్ఎస్ , బీజేపీ పార్టీలు కేవలం స్వార్థ రాజకీయ లబ్ధి కోసమే ‘తాండూర్, కొడంగల్’ అంటూ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన విమర్శించారు. తాండూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక్క ఉద్యోగిని కూడా బదిలీ చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు అదనంగా మరో 185 మంది కొత్త డాక్టర్లు, 500 మంది పారామెడికల్ సిబ్బంది ఇక్కడికి రానున్నారని వెల్లడించారు.రూ. 150 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం తాండూర్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని, ప్రజలెవరూ ప్రతిపక్షాల తప్పుడు అపోహలను, పుకార్లను నమ్మవద్దని కావలి సంతోష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.