― Advertisement ―

పెంచిన ధరలను తగ్గించాలి..! 

ఎన్నికలు ముగియగానే సామాన్యుడిపై భారం వేస్తారా? కేంద్ర మోదీ ప్రభుత్వంపై డీసీసీ అధికార ప్రతినిధి కే. గోపాల్ తీవ్ర ఆగ్రహం జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్రంలోని...
HomeNEWSసోషల్ మీడియా ఆరోపణలు సిగ్గుచేటు..!

సోషల్ మీడియా ఆరోపణలు సిగ్గుచేటు..!

spot_img
  • డ్రగ్స్ కేసు రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కుట్ర
  • బక్రీద్ ఏర్పాట్లపై ఇప్పటికే ప్రత్యేక సమీక్షా సమావేశం
  • కాంగ్రెస్ పార్టీ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ బాతుల నాగరాజు

జనవాహిని ప్రతినిధి తాండూరు : నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా, ప్రతి సమస్యను రాజకీయ కోణంలో చూస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన ఆరోపణలు చేయడం అత్యంత సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ తాండూర్ టౌన్ అధ్యక్షులు బాతుల నాగరాజు విమర్శించారు. తాండూర్ పట్టణంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ‘పెయిడ్ ఆర్టిస్టులు’ పనిగట్టుకొని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.గతంలో డ్రగ్స్ కేసులో దొరికిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోయేలా చేయాలనే ఉద్దేశ్యంతోనే, ప్రస్తుత ఎమ్మెల్యేపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సైతం హాస్పిటల్ ను సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారని చెప్పారు. కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్టిస్టులు నిరుపేద ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు దూరం చేసేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.అలాగే రానున్న బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే ను ముస్లిం సోదరులకు దూరం చేయాలనే మరో కుట్ర జరుగుతోందని, రెండు రోజుల క్రితమే క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులు, మైనారిటీ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారని వెల్లడించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని, చౌకబారు రాజకీయాలు చేస్తే తాండూర్ ప్రజలు క్షమించరని బాతుల నాగరాజు హెచ్చరించారు.