- పాత తాండూరుకు కో ఆప్షన్ పదవి ఆమేర్ అబ్దుల్లా కృషి అభినందనీయం
- పాత తాండూర్ కాంగ్రెస్ నాయకులు అన్వర్ ఖాన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కౌన్సిల్లో నూతనంగా ఎన్నికైన 4 కోఆప్షన్ మెంబర్ల ఎన్నికలలో ముఖ్యంగా పాత తాండూరుకు చెందిన ఆఫ్రిన్ జెవేరియా అన్వర్ ఖాన్ కో ఆప్షన్ పదవి లభించడంలో పాత తాండూరు ఆరు వార్డుల ఇంచార్జ్ ఆమేర్ అబ్దుల్లా ఎంతో కృషి చేశారని వార్డు నెంబర్ 17 కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ నూతన కో ఆప్షన్ నెంబర్ ఆఫ్రిన్ జవేరియా భర్త అన్వర్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా పాత తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం ఆమేర్ అబ్దుల్లాను శాలువాలతో సన్మానించి పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు అన్వర్ ఖాన్ మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పార్టీ కోసం కష్టపడితే రానున్న కో ఆప్షన్ మెంబర్ల ఎన్నికలలో కచ్చితంగా అవకాశం కల్పిస్తామని నాడు చెప్పిన విధంగా స్థానిక తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు శివారెడ్డి, పాత తాండూర్ ఆరు వార్డుల ఇంచార్జ్ ఆమేర్ అబ్దుల్లా తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వసీం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాల, రహీం ఖాన్ నవీద్ ఖాన్, తౌఫిక్, ఫెరోజ్ షా, మహమ్మద్ నూర్, షేక్ వసీం, ఉర్దూఘర్ చైర్మన్ జలాల్, ఖయ్యూం,మొయిజ్ తదితరులు పాల్గొన్నారు




