- వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గర్భిణీలకు అండగా ‘ఉచిత బేబీ కిట్’
- ప్రభుత్వ సహాయం తరహాలోనే వినూత్న సేవలు
- ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఉచిత పంపిణీ
- తొలి కిట్‌ను అందజేసిన వినాయక గ్రూప్ అధినేత వర్త్య విట్టల్ నాయక్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువవుతూ, సామాజిక దృక్పథంతో వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చే ప్రతీ మహిళకు ఉచితంగా ‘న్యూ బోర్న్ బేబీ కిట్’ అందించే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. ప్రభుత్వ రంగంలో ఇచ్చే కిట్ల తరహాలోనే, రోగులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఆసుపత్రి యాజమాన్యమే స్వచ్ఛందంగా ఈ ఖర్చును భరిస్తూ ఈ కిట్లను అందజేస్తోంది.మండల పరిధిలోని కుంచారం గ్రామానికి చెందిన అంబిక అనే గర్భిణీ ప్రసవ వేదనతో వినాయక ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అమృత్ రాథోడ్ నేతృత్వంలోని బృందం ఆమెకు కాన్పు చేయగా, సుఖప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో, ఆసుపత్రి కొత్తగా ప్రవేశపెట్టిన ‘న్యూ బోర్న్ బేబీ కిట్’ను వినాయక గ్రూప్ అధినేత వర్త్య విట్టల్ నాయక్ చేతుల మీదుగా బాలింత అంబికకు అందజేసి, తల్లికి, బిడ్డకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వినాయక గ్రూప్ అధినేత విట్టల్ నాయక్ మాట్లాడుతూ.. తాండూరు ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు, మానవీయ కోణంలో సేవ చేయడమే తమ ఆసుపత్రి ముఖ్య ఉద్దేశమన్నారు. తమ వద్దకు ప్రసవానికి వచ్చే వారికి పుట్టేది ఆడబిడ్డ అయినా, మగబిడ్డ అయినా ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఈ ఉచిత బేబీ కిట్‌ను అందిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గర్భిణీలు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.కాగా, ప్రసవం విజయవంతమై తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండటం పట్ల ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత్ రాథోడ్, డాక్టర్ నితీష్, ఆసుపత్రి సూపర్వైజర్ నరేష్ మరియు ఇతర నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.




