Wednesday, June 10, 2026

― Advertisement ―

సీతారాంపేట్‌లో తీరిన తాగునీటి కష్టాలు..!

 సకాలంలో స్పందించి బోరు మోటార్ వేయించిన మున్సిపల్ యంత్రాంగం, కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ కు వార్డు ప్రజల కృతజ్ఞతలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు...
HomeNEWSసీతారాంపేట్‌లో తీరిన తాగునీటి కష్టాలు..!

సీతారాంపేట్‌లో తీరిన తాగునీటి కష్టాలు..!

spot_img
spot_img
  •  సకాలంలో స్పందించి బోరు మోటార్ వేయించిన మున్సిపల్ యంత్రాంగం, కౌన్సిలర్
  • మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ కు వార్డు ప్రజల కృతజ్ఞతలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు సీతారాంపేట్ కాలనీలో దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఎండ తీవ్రతకు తోడు కాలనీలో నీటి ఇబ్బందులు తలెత్తడంతో, ప్రజల దాహార్తిని తీర్చేందుకు అత్యవసరంగా నూతన బోరు బావి తవ్వించి, కొత్త మోటారును బిగించారు.ప్రజల అవసరాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన బోరు మోటార్ ఏర్పాటుకు సహకరించిన తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ ఏఈ తో పాటు స్థానిక వార్డు కౌన్సిలర్ జంటుపల్లి వెంకటేష్ కు సీతారాంపేట్ కాలనీవాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి పరిష్కరించడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.