Wednesday, June 10, 2026

― Advertisement ―

సీతారాంపేట్‌లో తీరిన తాగునీటి కష్టాలు..!

 సకాలంలో స్పందించి బోరు మోటార్ వేయించిన మున్సిపల్ యంత్రాంగం, కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ కు వార్డు ప్రజల కృతజ్ఞతలు జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు...
HomeNEWSప్రతిభకు పేదరికం అడ్డుకాదు...!

ప్రతిభకు పేదరికం అడ్డుకాదు…!

spot_img
spot_img
  • క్రీడాకారుల ప్రతిభకు ‘ఆర్‌బీఓఎల్’ అండ
  •  అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికైన గాజీపూర్ యువకుడికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం
  • చెక్కు అందజేసిన సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారి ఉన్నత ఆశయాలకు ఆసరాగా నిలిచేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆర్‌బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ అథ్లెట్ ఎర్రా హర్షవర్ధన్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యడు. బుధవారం హర్షవర్ధన్ ప్రతిభను అభినందిస్తూ, పోటీల ఖర్చుల నిమిత్తం రూ. 1,50,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.గాజీపూర్ గ్రామానికి చెందిన సామాన్య రైతు ఎర్రా చిన్న ఎల్లప్ప కుమారుడైన హర్షవర్ధన్, చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలోనే బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ’కి ఎంపికయ్యాడు. గత ఐదేళ్లుగా అక్కడే ఉంటూ సెయిలింగ్ (బోటింగ్) క్రీడలో కఠిన శిక్షణ పొందుతూ, జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ఇండియన్ సెయిలింగ్ అథ్లెట్‌గా నిలిచాడు. ఈ నెల 24వ తేదీ నుండి మలేషియాలోని లంఖావి వేదికగా జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించేందుకు హర్షవర్ధన్ ఎంపికయ్యాడు.అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు పేద కుటుంబానికి భారం కావడంతో, హర్షవర్ధన్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని గాజీపూర్ గ్రామ సర్పంచ్, పెద్దలు ఆర్‌బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హర్షవర్ధన్ మలేషియా పోటీల్లో స్వర్ణ పతకం సాధించి, దేశంతో పాటు తాండూరు ప్రాంత కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. పేదరికం ఏ క్రీడాకారుడి ఎదుగుదలకు అడ్డుకారాదన్నారు.ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ లాల్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త పర్యాద రామకృష్ణ, భద్రేశ్వర దేవస్థాన మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, తాండూరు 19వ వార్డు కౌన్సిలర్ జుంటిపల్లి వెంకట్, కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్, సందీప్ రెడ్డి, గ్రామ పెద్దలు ప్రకాష్ రెడ్డి, నసీర్, నర్సిములు, లాలప్ప తదితరులు పాల్గొన్నారు. పేద అథ్లెట్‌కు అండగా నిలిచిన శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్థులు, క్రీడా సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.