Saturday, June 6, 2026

― Advertisement ―

గడప తట్టిన మాతృత్వపు కానుక…!

గర్భిణీలకు అండగా ‘కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్’ గడప గడపకూ వెళ్లి ‘శ్రీమంత కానుక’ అందజేత లబ్ధిదారుల హర్షం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో కంజర్ల విజయలక్ష్మి...
HomeNEWSశిక్షణ శిబిరం వాయిదా...!

శిక్షణ శిబిరం వాయిదా…!

spot_img
spot_img
  • తాండూర్‌లో కాంగ్రెస్ బిఎల్ఎ ల శిక్షణ వాయిదా
  • ఈ నెల 9న వినాయక ఫంక్షన్ హాల్‌లో నిర్వహణ
  •  తేదీ, వేదిక మార్పును గమనించాలి: ‘సార్’ కన్వీనర్ పురుషోత్తం రావు

జనవాహిని ప్రతినిధి తాండూరు : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సార్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు తాండూర్‌లో నిర్వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ బి.ఎల్.ఎల శిక్షణ కార్యక్రమం వాయిదా పడింది. అనివార్య కారణాల దృష్ట్యా ఈ శిక్షణ తరగతుల తేదీ మరియు వేదికలో స్వల్ప మార్పులు జరిగినట్లు ‘సార్’ నియోజకవర్గ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఒక ప్రకటనలో తెలిపారు.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీ ఆదివారం తులసీ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే, మారిన షెడ్యూల్ ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటల నుండి స్థానిక ‘వినాయక ఫంక్షన్ హాల్’లో నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం యథావిధిగా కొనసాగుతుందని కన్వీనర్ వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు బిఎల్ఎ లు ఈ స్వల్ప మార్పును గమనించాలని, అందరూ సకాలంలో హాజరై సమన్వయంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.