― Advertisement ―

అర్హులైన నిరుపేదలకే ‘డబుల్’ ఇళ్లు….! 

- ఏ ఒక్క సంస్థకో ఇళ్ల కేటాయింపు జరగలేదు..  - కేవలం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే  - అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక -  ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు - తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్  నీరజ...
HomeNEWSమంత్రులను అడ్డుకుంటాం..! 

మంత్రులను అడ్డుకుంటాం..! 

spot_img

ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపాలిటీ విఫలం

– 8వ వార్డు కౌన్సిలర్ ఆవేదన

– అభివృద్ధిలో వివక్ష చూపుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లు

– కాగితాలకే పరిమితమైన ఎజెండా నిర్ణయాలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : 4వి తేదీన తాండూరు కు రానున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులను అడ్డుకుంటాం అని 8వి వార్డ్ కౌన్సిలర్ జావీద్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ కౌన్సిలర్లు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని తాండూరు 8వ వార్డు కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలనలో పక్షపాతం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.గత మార్చి 5న జరిగిన సాధారణ సమావేశంలో వేసవి తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రతి వార్డులో కొత్త బోర్ల డ్రిల్లింగ్, మోటార్ల బిగింపు చేపట్టాలని తీర్మానించారని గుర్తు చేశారు. అయితే, అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో పనులు జరుగుతున్నాయని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న ప్రాంతాల్లో కనీసం ఒక్క బోర్ కూడా వేయలేదని విమర్శించారు. తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే రాజకీయాలు చేయడం సరికాదన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి 8వ వార్డు గుండా వెళ్తుందని, ప్రస్తుతం అక్కడ వీధి దీపాలు వెలగక వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. క్రేన్ అందుబాటులో లేదనే కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. పక్కనే ఉన్న వికారాబాద్ నుంచి క్రేన్ తెప్పించి లైట్లు బాగు చేయించలేరా? అని నిలదీశారు. గతంలో తాను చేసిన పోరాటాల ఫలితంగా రూ.26 కోట్లు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆరోపించారు. పనులు ప్రారంభించకుండా కేవలం ఎజెండాలో లక్షలాది రూపాయలు కేటాయించుకోవడం ఎవరి కోసం? అని ప్రశ్నించారు. మున్సిపల్ యంత్రాంగం అంతా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు పైనే శ్రద్ధ పెడుతూ, వార్డుల్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వివక్ష వీడి అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.