― Advertisement ―

అర్హులైన నిరుపేదలకే ‘డబుల్’ ఇళ్లు….! 

- ఏ ఒక్క సంస్థకో ఇళ్ల కేటాయింపు జరగలేదు..  - కేవలం దరఖాస్తుల స్వీకరణ మాత్రమే  - అవినీతికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక -  ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు - తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్  నీరజ...
HomeNEWSనొప్పి భరించలేకే యువకుడు బలి...!

నొప్పి భరించలేకే యువకుడు బలి…!

spot_img

గొల్లచెరువులో విషాదం

– దూలానికి ఉరివేసుకుని సంతోష్ ఆత్మహత్య

– తల్లీ పిర్యాదు మేరకు కేసు నమోదు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : కడుపునొప్పి ఆ యువకుడి ప్రాణం తీసింది. వ్యాధి తీవ్రతను భరించలేక మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు పట్టణం పరిధిలోని గొల్లచెరువులో శనివారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బోయ సంతోష్ (19) గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో సతమతమవుతున్నాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. ఈ క్రమంలో నొప్పి మళ్ళీ తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయిన సంతోష్, ఇంట్లోని దూలానికి ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.