Wednesday, June 10, 2026

― Advertisement ―

బండరాయితో భార్యపై దాడి…!

బండరాయితో భార్యను చంపినా భర్త  అల్లాపూర్ లో ఘటన  అక్రమ సంబంధనే కారణం....!  జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండలంలోని అల్లాపూర్ శివారులో గల పాలిషింగ్ యూనిట్‌లో మంగళవారం రాత్రి దారుణ...
HomeNEWSబండరాయితో భార్యపై దాడి...!

బండరాయితో భార్యపై దాడి…!

spot_img
spot_img
  • బండరాయితో భార్యను చంపినా భర్త 
  • అల్లాపూర్ లో ఘటన 
  • అక్రమ సంబంధనే కారణం….! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండలంలోని అల్లాపూర్ శివారులో గల పాలిషింగ్ యూనిట్‌లో మంగళవారం రాత్రి దారుణ హత్య జరిగింది. అక్రమ సంబంధం కారణంగా తలెత్తిన వివాదంలో ఓ భర్త కన్నెర్ర జేసి, కట్టుకున్న భార్యను రాయితో కొట్టి ముగించిన ఘోర ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బీహార్ రాష్ట్రం పూర్నియా జిల్లాకు చెందిన జీరో రిషి (32), భార్య సరీతా దేవి (33), నాలుగేళ్ల కుమారుడు రాజుతో కలిసి ఆరు నెలల క్రితం ఉపాధి కోసం తాండూరుకు వలస వచ్చారు. అల్లాపూర్ గ్రామంలోని వీఆర్ పాలిషింగ్ యూనిట్‌లో కూలీలుగా పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న భాస్కర్ రెడ్డి పాలిషింగ్ యూనిట్‌లో పనిచేసే తోఫిక్ ఆలంతో సరీతా దేవికి పరిచయం ఏర్పడి, అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.భార్యాభర్తలిద్దరికీ మద్యం తాగే అలవాటు ఉండటంతో, తరచూ పొరుగు యూనిట్ కార్మికులతో కలిసి తాగేవారు. ఈ క్రమంలోనే రిషి, సరీతా దేవి, తోఫిక్ ఆలం ముగ్గురూ కలిసి తోఫిక్ నివాసంలోనే తరచూ మద్యం సేవించేవారు. ఈ నేపథ్యంలో భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న రిషి.. తోఫిక్ ఆలంతో ఉన్న పరిచయాన్ని వెంటనే వదులుకోవాలని సరీతా దేవిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాటను ఏమాత్రం లెక్కచేయలేదు.మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య తోఫిక్ ఆలం విషయమై మళ్లీ తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశం కట్టలు తెంచుకున్న రిషి.. పక్కనే ఉన్న పెద్ద రాయితో సరీతా దేవి తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. భయాందోళనకు గురైన నిందితుడు రిషి.. వెంటనే తన పాలిషింగ్ యూనిట్ యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించాడు.స్థానికులు వెంటనే స్పందించి సరీతా దేవిని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.బుధవారం అందిన ఫిర్యాదు మేరకు తాండూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు జీరో రిషిని అదుపులోకి తీసుకున్నామని, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు రూరల్ పోలీసులు స్పష్టం చేశారు.