― Advertisement ―

ఘనాపూర్‌లో ఆధ్యాత్మిక సంబరం…!

ఘనాపూర్‌లో వైభవంగా శ్రీ శివరామ దుర్గా క్షేత్ర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ముఖ్య అతిథిగా ఆర్.బి.ఎల్. సిఇఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఆధ్యాత్మిక వేడుకలు జనవాహిని...
HomeNEWSబంటు వేణుకు భారీ మెజారిటీ ఇవ్వండి...!

బంటు వేణుకు భారీ మెజారిటీ ఇవ్వండి…!

spot_img
  • సాయిపూర్‌లో ‘మనోహరన్న’ సుడిగాలి పర్యటన
  • కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి
  • ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి దశలో ఊపందుకుంది. ఆదివారం సాయిపూర్‌లోని 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంటు వేణుగోపాల్‌కు మద్దతుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ, ప్రజలతో మమేకమై ‘హస్తం’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారానికి, వార్డుల సౌకర్యార్థం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బంటు వేణుగోపాల్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.