- ఘనాపూర్‌లో వైభవంగా శ్రీ శివరామ దుర్గా క్షేత్ర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు
- ముఖ్య అతిథిగా ఆర్.బి.ఎల్. సిఇఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
- ఈ నెల 29 వరకు కొనసాగనున్న ఆధ్యాత్మిక వేడుకలు
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : మండల పరిధిలోని ఘనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివరామ దుర్గా క్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజ స్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నుండి 29 సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. పూజ్యశ్రీ శ్రీశ్రీశ్రీ శివానంద గురుస్వామి దివ్య కరకమలములచే ఈ విగ్రహ ప్రతిష్ఠాపన పూజాది కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరగనున్నాయి. ఆలయంలో శ్రీ శివలింగం, శ్రీ దుర్గాదేవి, శ్రీ సీతారామ లక్ష్మణ, శ్రీ ఆంజనేయ, శ్రీ దత్తాత్రేయ, నవగ్రహాలు, మరియు నాగదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి ఆర్.బి.ఎల్. సిఇఓ, ప్రముఖ అన్నప్రసాద దాత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నరు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం ఉదయం 11:00 గంటలకు సాధు సంతుల సమక్షంలో సనాతన ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు.ఈ వేడుకల్లో తిరుమలాపూర్ రామాలయ ధర్మకర్త శ్రీ బుయ్యని రాఘవేందర్ రెడ్డి, శ్రీ శివరామ దుర్గా క్షేత్ర ఆలయ కమిటీ సభ్యులు ఘనాపూర్ రాఘవేందర్ గౌడ్, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు.




